ETV Bharat / state

ఆస్తుల నమోదును వేగంగా పూర్తి చేయాలి: పమేలా సత్పతి

author img

By

Published : Oct 20, 2020, 10:49 PM IST

వరంగల్​ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్​ పమేలా సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణిలో ఆస్తుల నమోదు, ఎల్​ఆర్​ఎస్​ల పురోగతిపై అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

commissioner pamela sathpathi review meeting with officials
ఆస్తుల నమోదును వేగంగా పూర్తి చేయాలి: పమేలా సత్పతి

వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ధరణిలో ఆస్తుల నమోదు, ఎల్​ఆర్​ఎస్​ల పురోగతిపై బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని వేగంగా సాధించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నగర ప్రజల సౌకర్యార్థం బల్దియా పరిధిలోని 11 రెవెన్యూ వార్డు కార్యాలయాల్లో ధరణి నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్​ పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా 12 వేల మంది తమ ఆస్తులను నమోదు చేసుకున్నారని తెలిపారు. గ్రేటర్ పరిధిలో 2,12,417 గృహాలకు గానూ 1,29,063 ఆస్తులు నమోదయ్యాయని.. ఇంకా మిగిలి ఉన్న 83,354 వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు నిబద్ధతతో కృషి చేయాలన్నారు.

మరోవైపు ఈనెల 31తో ఎల్​ఆర్​ఎస్​ గడువు ముగుస్తుండటం వల్ల శరవేగంగా లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 86,789 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎల్​ఆర్​ఎస్​పై ప్రజల్లో మరింత చైతన్యం కల్పించాలని సూచించారు.

ఇదీ చూడండి.. పురాతన భవనాలను కూల్చేస్తున్నాం: లోకేశ్​కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.