ETV Bharat / state

'ప్రజలు సహకరిస్తే తొందరగానే కరోనాను తరిమికొట్టొచ్చు' - LOCK DOWN UPDATES

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని కరోనా ప్రభావిత ప్రాంతమైన రంగంపేటలో అధికారులతో కలిసి కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు పర్యటించారు. ప్రజలు సహకరిస్తే మరింత తొందరగా... కరోనాను తరిమికొట్టవచ్చని కలెక్టర్​ సూచించారు.

COLLECTOR VISITS WARANGAL CORONA EFFECTED AREA RANGAMPET
'ప్రజలు సహకరిస్తే అతిత్వరలోనే కరోనాను తరిమికొట్టొచ్చు'
author img

By

Published : Apr 16, 2020, 3:18 PM IST

లాక్‌డౌన్‌కు ప్రజలు పక్కాగా సహకరిస్తే వైరస్‌ను అతి తొందరగానే కరోనాను తరిమికొట్టగలమని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. నగర పోలీస్ కమిషనర్ వి.రవీందర్, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి వైరస్ ప్రభావిత ప్రాంతమైన రంగంపేటలో కలెక్టర్​ పర్యటించారు.

నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదా అని స్థానికులను కలెక్టర్​ అడిగి తెలుసుకున్నారు. హోం క్వారెంటైన్​లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారితో ఉన్న సంబంధీకులైన 305 మందికి పరీక్షలు నిర్వహించామని... వారందరికీ నెగిటవ్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు.

వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ముమ్మరంగా జరుగుతోందని... ఇప్పటివరకు ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని చెప్పారు. అవసరమైతే ఇన్‌ఫ్రారెడ్‌ థర్మల్‌ స్కానర్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.