ఎస్సీ లబ్ధిదారులకు కూరగాయల పెంపకం ద్వారా ఆర్థిక బలోపేతం చేసేందుకు శాశ్వత పందిర్ల గ్రౌండింగ్ పక్రియను వేగవంతం చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ లబ్ధిదారుల గ్రౌండింగ్ కమిటీ భేటీ అయ్యారు.
ఎస్సీ లబ్ధిదారులకు సబ్సిడీ మంజూరు చేసిన దృష్ట్యా సంబంధిత డీలర్ నుంచి నాణ్యమైన మెటీరియల్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రౌండింగ్ కమిటీ సభ్యులు తరచూ పరిశీలన చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రౌండింగ్ అయిన యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేందుకు కావాల్సిన శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. కూరగాయల పెంపకంపై ఉద్యాన వన శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు.
ఇదీ చూడండి.. సన్నాల సాగుతో తీవ్రనష్టం... రైతును నట్టేట ముంచిన తెగుళ్లు