వరంగల్ మహానగర పాలక సంస్థలో వచ్చే ఉగాది నుంచి ఇంటింటికి నల్లాలతో త్రాగునీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో అమృత్ పథకం కింద పైపులైన్, ఫిల్టర్ బెడ్ల నవీకరణ, రోడ్డు విస్తరణ పనులు సమీక్షించారు.
కొత్తవి వేయాలి..
హన్మకొండలో గ్రెటర్ కమిషనర్ పమేలా సత్పతితో కలసి బల్దియా, పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ ఇంజనీర్లతో సమావేశం జరిపారు. పాత, లేకేజీలున్న పైపులైన్ స్థానంలో కొత్తవి వేయాలన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 1,92,357 గృహాలు ఉండగా.. 1,76,965 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.
ట్రయల్‌రన్ జరుగుతోంది..
మిగిలిన 15,392 వాటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో 72 ఈఎస్ఎల్ఆర్ల్లో 22 ఈఎస్ఎల్ఆర్ల ద్వారా పలు ప్రాంతాల్లో ప్రతిరోజు ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. 18 ఈఎస్ఎల్ఆర్ల ద్వారా నీటి సరఫరాకు ట్రయల్‌రన్ జరుగుతోందని, మిగిలిన 32 ఈఎస్ఎల్ఆర్లతో సరఫరా ఈ నెలలోగా పూర్తి కావాలని ఆదేశించారు.
గడువులోగా పూర్తి..
విలీన గ్రామాల ఆన్సర్వేడ్ ప్రాంతంలోని 1,374 కిలోమీటర్ల పైపులైన్లు 100 శాతం పూర్తయినట్లు చెప్పారు. 324 కిలోమీటర్లు పైపులైన్ల రీప్లేస్‌మెంట్‌కు 82 కి.మీ చేశారని.. ప్రస్తుతం పనిచేస్తున్న 45 బ్యాచ్‌లకు అదనంగా ఏర్పాటు చేసి మిగిలినవి గడువులోగా పూర్తి చేయాలన్నారు. పైపులైన్లు మార్చడంతో కోర్ ఏరియాకు నీటి సమస్య ఉండదని అన్నారు.
ఇదీ చూడండి: బీమా క్రైం కథలు: తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ల అరాచకాలు