ETV Bharat / state

'వైకుంఠ దామాలు, డంపింగ్​ యార్డుల నిర్మాణాలు త్వరగా పూర్తవ్వాలి' - కలెక్టర్ రాజీవ్​గాంధీ సమీక్ష సమావేశం

పల్లె పకృతి వనాలు, వైకుంఠ దామాలు, డంపింగ్​ యార్డుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి రాజీవ్​ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టర్​ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

collector rajeev gandhi review meeting with officials
'వైకుంఠ దామాలు, డంపింగ్​ యార్డుల నిర్మాణాలు త్వరగా పూర్తవ్వాలి'
author img

By

Published : Sep 21, 2020, 10:58 PM IST

పల్లెప్రగతిలో చేపట్టిన వైకుంఠ దామాలు, డంపింగ్​ యార్డుల నిర్మాణాలను ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఏపీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతిలో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సమీక్షించారు.

పల్లె పకృతి వనాలు, వైకుంఠ దామాలు, డంపింగ్​ యార్డుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హసన్​పర్తి మండలంలో 3, కమలాపూర్​లో ఒక డంపింగ్​ యార్డు పనులు ఇంకా మొదలు కాలేదని.. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి నర్సరీకి ప్రహరీ, బోర్డు తప్పరిసరిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని, అన్ని మండలాల్లో ఇంటి పన్నుల వసూళ్లను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.

ఇదీచూడండి.. కలెక్టర్​పై సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.