కరోనా మహమ్మారిపై ఉన్నదే చెప్పాలని.. అనవసర దుష్ప్రచారాలు వద్దని.. పలు మీడియా సంస్థలకు హితవు పలికారు సీఎం కేసీఆర్. భయమే అన్నింటి కన్నా ప్రమాదకమన్నారు. ఈ సందర్భంగా ఓ కథ చెప్పారు..
పూర్వం ఓ రాజ్యాంలో గత్తర్ (కలరా) వచ్చింది. అనేక మంది చచ్చిపోతాండ్రు. ఏంచేద్దాం రా అంటూ చాలా ప్రయత్నాలు చేశారు. రాజు, అక్కడి వైద్యులు తిప్పలు పడినా.. నానా కష్టాలు పడ్డా.. కమ్మి అయితా లేదు. మరి ఎట్లా... అంటే ఓ మాంత్రికుడు ఉన్నాడు వాడిని తీసుకొస్తే.. గ్యారంటీగా తరిమేస్తాడంటే వాడిని బతిమాలి బామాలి తోలుకొచ్చారు. మాంత్రికుడు.. రాజ్యం పొలిమేర వరకు వచ్చాడు... ఆ మహమ్మారికీ కూడా వాడంటే భయమే.. మాంత్రికుడు రాజ్యంలోనికి వస్తుంటే.. మహమ్మారి బయటకు పోతోంది. ఇద్దరు ఎదురుపడ్డారు. అనవసరంగా ఐదు వందల మందిని చంపితివి కదే.. అని ప్రశ్నించాడు. అన్నా నేనే హిమాందర్గా చెబుతున్నా.. నేను చంపింది యాభై మందినే.. మిగతా నాలుగు వందల యాభై మంది దగడ్కే చచ్చిపోయిండ్రు పిచ్చోళ్లు అని మహమ్మారి చెప్పిందంటూ చెప్పిన కేసీఆర్... అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించారు.. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని ఈ కథ ద్వారా కేసీఆర్ వివరించారు.
ఇదీచూడండి: KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది