వరంగల్ నగరంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా మొదలైంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే లోపలకి అనుమతిస్తున్నారు. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువులను నిరాకరించిన అధికారులు శానిటైజర్, వాటర్ బాటిల్‌కు అనుమతి ఇచ్చారు. గంటన్నర ముందే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ పోలీసులు విధించి అభ్యర్థులను విస్తృతంగా తనిఖీ చేసి లోపలకు పంపించారు.
ఇదీ చదవండి: సివిల్ సర్వీసెస్ పరీక్షకు సర్వం సిద్ధం