ETV Bharat / state

అందరూ ఉండి కూడా అనాథలా మిగిలిన తల్లి మృతదేహం - warangal urban

ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని. వార్ధక్యంలో వారి నీడలో హాయిగా గడిపి... కాలం చెయ్యాలని ఆశపడతారు. కానీ డబ్బు మోజులో పడిన మనుషులు మాతృత్వ బంధానికి నీళ్లొదిలేస్తున్నారు. బిడ్డలకు బరువైన ఓ మాతృమూర్తి ఓ అనాథ ఆశ్రమంలో తుది శ్వాస విడిచింది. బతికుండగా కానరాని పిల్లలు... అంతిమ సంస్కారానికొచ్చి మొసలి కన్నీళ్లు కార్చారు. ఆశ్రమ నిర్వాహకురాలే కన్న కొడుకై తలకొరివి పెట్టింది.

అందరూ ఉండి కూడా అనాథలా మిగిలిన తల్లి మృతదేహం
author img

By

Published : Sep 12, 2019, 11:55 PM IST

ఐదుగురు బిడ్డలుండి కూడా ఓ తల్లి అనాథలా మిగిలింది. కడుపున పుట్టిన వారికే బరువై అనాథాశ్రమంలో కన్నీళ్లు మింగుకుంటూ... పిల్లలను తలచుకుంటూ గడిపింది. అంతిమ కాలంలో నా అన్నవాళ్లు కరవై దిక్కులేనిదానిలా ఈనెల రెండోతేదీన తుదిశ్వాస విడిచింది. అందరూ ఉండి కూడా అనాథలా రుద్రభూమికి చేరింది. వార్ధక్యంలో ఆదుకున్న అమ్మ అనాథాశ్రమ నిర్వాహకులే అన్నీ తామై ఆ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ హృదయవిదారకర ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేటలో జరిగింది.

గుండెల్లోనే దాచుకుంది

కాజీపేటలోని అమ్మ అనాథ ఆశ్రమంలో మల్లికాంబ అనే 90 ఏళ్ల వృద్ధురాలు ఈనెల రెండున మరణించింది. ఆమె మరణించిన విషయం కంటే ఆమె చనిపోయిన తర్వాత తెలిసిన విషయాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఐదుగురు బిడ్డలుండి కూడా ఆ తల్లిని అనాథ ఆశ్రమంలో వదిలేశారు. ఎన్ని బాధలొచ్చినా... చివరకు చనిపోయే సమయంలో కూడా ఆ తల్లి తన గతాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే తనవిషయమై బిడ్డలను ఎవ్వరూ ఏమనుకూడదు అనుకుందో ఏమో దుఖాన్ని గొంతులోనే దిగమింగుకుంది.

అన్నీ తానైన అనాథాశ్రమ నిర్వాహకురాలు

నెలరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచింది. ఆమె మరణ సమాచారం తెలిసి వచ్చిన కూతుళ్ల ద్వారా ఆమెకు ఇద్దరు కొడుకులున్నారన్న విషయం తెలిసింది. మూడేళ్లుగా తల్లి ముఖం చూడని పిల్లలు తల్లి శవాన్ని చూడడానికి హన్మకొండలోని శ్మశానవాటికకు వచ్చారు. బతికుండగా పట్టించుకోని వారంతా వచ్చి మొసలి కన్నీళ్లు కార్చారు. మల్లికాంబ చివరి కోరికపై ఆశ్రమ నిర్వాహకురాలే అన్నీ తానై తలకొరివి పెట్టింది. అందరూ ఉండి కూడా అనాథలా కన్ను మూసిన ఆ తల్లి మృతదేహాన్ని చూసి అక్కడున్న వారి హృదయం ద్రవించింది.

పిల్లల నీడలో తమ చివరి రోజులు గడచిపోయి... వాళ్ల చేతుల్లో తమ తనువు చాలించాలనుకుంటారు తల్లిదండ్రులు. ప్రాణం పోతుందని తెలిసినా ప్రాణం పోసిన వారికి అమాత్రం చేయలేమా...

అందరూ ఉండి కూడా అనాథలా మిగిలిన తల్లి మృతదేహం
ఇదీ చూడండి: 'ఆస్తి కోసం సోదరులే హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.