cji nv ramana warangal tour : వరంగల్‌లో కొత్తగా నిర్మించిన పది కోర్టులతో కూడిన న్యాయస్థాన భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 19న ప్రారంభించనున్నారు. ఈ మేరకు వరంగల్ న్యాయమూర్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 18న సీజేఐ వరంగల్‌కు చేరుకుని యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు సమాచారం.
అలాగే వరంగల్ నగరంలోని పర్యాటక ప్రాంతాలనూ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏర్పాట్లలో భాగంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావు వరంగల్ కోటలో పర్యటించి అధికారులకు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: employees allotment: ఉద్యోగుల విభజనపై నేటి నుంచి ఐచ్ఛికాల స్వీకరణ