ETV Bharat / state

పడకలు కావాలన్నా, మృతదేహాలు తరలించాలన్నా రూ.వేలల్లో వసూలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో నయా దందా సాగుతోంది. రోగుల కన్నీరు కొందరికి ఆదాయ వనరవుతోంది. కాసులు తడపనిదే పడకలు దొరకని పరిస్థితి.. మృతదేహాలను బయటకు తీసుకురావడానికీ సమర్పించాల్సిందే.. అంతా తెలిసినా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. వైద్యసేవలందించాల్సిన వారే దళారులుగా మారడంతో రోగుల కుటుంబాలు ఎవరికి చెప్పాలో తెలియక ఆగమవుతున్నారు.

warangal mgm hospital latest news, Charges in the thousands of rupees corona patients
పడకలు కావాలన్నా, మృతదేహాలు తరలించాలన్నా రూ.వేలల్లో వసూలు
author img

By

Published : May 7, 2021, 12:43 PM IST

  • రంగశాయిపేటకు చెందిన ఓ వ్యక్తిని ఆటోలో కుటుంబసభ్యులు తీసుకురాగా, అక్కడి సిబ్బంది పడకలు లేవని వెనక్కి పంపారు. వారే మరొకరి ద్వారా ప్రయత్నిస్తే అడ్మిట్‌ చేసుకొని పడక కేటాయించారు.
  • హన్మకొండకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబసభ్యులు కరోనాతో మృతిచెందగా మృతదేహాన్ని ప్యాక్‌ చేసి ఇవ్వడానికి వార్డులోని దళారులు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు. ఎంజీఎం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిసింది.
  • వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలానికి చెందిన ఓ వృద్ధురాలిని కుటుంబసభ్యులు కొవిడ్‌ వార్డులో చేర్పించడానికి తీసుకురాగా, అడ్మిట్‌ చేసుకోవడానికి ముందు పడకలు లేవన్నారు. తెలిసిన వారితో చెప్పించగా అడ్మిట్‌ చేసుకున్నారు. తీరా ఆమెను వార్డులోకి తీసుకెళ్తుండగా ఆక్సిజన్‌ అందక స్ట్రెచర్‌పైనే మరణించింది.
  • కొవిడ్‌ వార్డులో చేరడానికి వచ్చిన వారికి ముందే కొందరు పడకలు లేవని భయపెడుతున్నారు. చేతిలో డబ్బులు పెడితే లోపలకు పంపిస్తున్నారు. ఈ దళారుల్లో ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందితో పాటు, గతంలో పనిచేసి మానేసిన వారున్నారు.

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో దోపిడి తీవ్రంగా కొనసాగుతోంది. సాధారణ వార్డుల్లోకి వెళ్లినంత సులభంగా కొవిడ్‌ వార్డుకు వైద్యాధికారులు, పోలీసు, మీడియా వెళ్లలేదు. నిఘా పెట్టేవారు లేరు. దీంతో కొందరు ముఠాగా మారి కొవిడ్‌ బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. పరీక్ష మొదలు, ఆసుపత్రిలో చేరడానికి, పడకలు కేటాయించడానికి, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సమకూర్చడానికి ఇలా ఒక్కో దానికి ఒక్కో రేటు చొప్పున రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. పాల్పడుతున్నారు.

సాధారణంగా వచ్చి పడకలు అడిగితే లేవంటారు. పక్కకు తీసుకెళ్లి చేయితడిపితే వారే లోపలకు తీసుకెళ్లి అడ్మిషన్‌ ఇప్పిస్తారు. ఇక వార్డులోకి వెళ్లాక ఆక్సిజన్‌ అందించాలి. దానికోసం మరో రేటు, డబ్బులిచ్చిన వారికి ఇతరులకు అమర్చిన వెంటిలేటర్‌ను తీసుకొచ్చి అమర్చుతారు. ఎందుకు వెంటిలేటర్‌ తొలగించారని బాధితుల కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే..ఆయనకు అవసరంలేదని సమాధానమిస్తారు. ఇక కొవిడ్‌తో మృతి చెందిన వారి మృతదేహాలను వార్డు నుంచి బయటకు తీసుకురావడానికి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. దహనానికి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలపైగా డిమాండ్‌ చేస్తున్నారు. డబ్బున్నవారు అడిగినంత ఇస్తుండగా లేనివారు అక్కడే వదిలేసి వెళ్తున్నారు. ఎంజీఎం కొవిడ్‌ వార్డు కేంద్రంగా నెల రోజులుగా కొందరు ఈ వసూళ్లకు పాల్పడుతూ ఒక వ్యక్తి రూ.లక్షల్లో సంపాదించారు.

నా దృష్టికి వచ్చింది.. చర్యలు తీసుకుంటాను
కొవిడ్‌ వార్డులో చేరడానికి వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. వారిని గుర్తించే పనిలో ఉన్నాం. వారెవరైనా ఉద్యోగం నుంచి తొలగిస్తాను. ఏదైనా ఉంటే నేరుగా నా ఛాంబర్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాను. మృతదేహాల ప్యాకింగ్‌ కోసం డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఇకపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాను.

- డాక్టర్‌ నాగార్జునరెడ్డి, సూపరింటెండెంట్‌, ఎంజీఎం ఆసుపత్రి

ఇదీ చూడండి: పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.