ETV Bharat / state

విజయోత్సాహంతో సంబురాలు చేసుకున్న అభ్యర్థులు

సహకార సంఘాల ఎన్నికల్లో అధికంగా తెరాస మద్దతుదారులు విజయభేరి మోగించారు. వరంగల్​ అర్బన్​ జిల్లాలోన కాజీపేట్​, ధర్మసాగర్​ మండలాల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సాహంతో సంబురాలు చేసుకున్నారు.

candidates-won-pacs-elections-and-celebrated-in-warangal-urban-district
విజయోత్సాహంతో సంబురాలు చేసుకున్న అభ్యర్థులు
author img

By

Published : Feb 15, 2020, 7:36 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్, ధర్మసాగర్ మండలాల్లో సహకార ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు సాయంత్రం ఫలితాలు వెలువడడంతో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సాహంతో సంబురాలు చేసుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట్ సహకార సంఘంలో 13 స్థానాలకు గానూ 3 స్థానాలను తెరాస మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 10 స్థానాలకు ఎన్నికలు జరగగా... 7 స్థానాల్లో తెరాస మద్దతుదారులు, 3 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు.

స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గంలోని ధర్మసాగర్ సహకార సంఘంలో 13 స్థానాలకు గానూ 5 స్థానాలను తెరాస మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 8 స్థానాలకు ఎన్నికలు జరగగా... 4 తెరాస మద్దతుదారులు, 3 తెరాస రెబల్స్, 1 స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారుడు విజయం సాధించారు. తమ అభ్యర్థులు గెలుపొందడం వల్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు వారిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

విజయోత్సాహంతో సంబురాలు చేసుకున్న అభ్యర్థులు

ఇవీ చూడండి: అక్రమాలు జరిగితే ఎవరినీ ఉపేక్షించం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.