సంక్రాంతి పండుగను పురస్కరించుకొని.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి కొత్తపల్లి నుంచి భక్తులు ఎడ్లబండ్లపై తరలి వెళ్లారు. ప్రతిఏటా ఎడ్లను అందంగా అలంకరించి, స్వామివారి దర్శనానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోందని వారు పేర్కొన్నారు.
అర్ధరాత్రి వేళ ఆలయానికి చేరుకున్న ఎడ్లబండ్లు.. భక్తుల సందడి మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. అవి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమను, తమ పాడి పంటలను చల్లగా చూడాలని కోరుకుంటూ ఊరేగింపుగా.. దేవాలయానికి వస్తామని గ్రామస్థులు తెలిపారు.
వేలేరు మండలం ఉప్పరపల్లి నుంచి వచ్చిన ఓ మేకపోతుల బండి ప్రత్యేకంగా నిలిచింది. యువకులు బండి ముందు సెల్ఫీలు దిగుతూ నృత్యాలు చేశారు.
ఇదీ చదవండి: అట్టహాసంగా ఐనవోలు మల్లన్న జాతర