BRS Leaders Inavolu Jatara Ticket Issue : ఉత్తర తెలంగాణ వాసులు కొంగు బంగారంగా కొలిచే ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ఉగాది వరకు సాగే జాతరకు భక్తులు ముందుగానే తరలివస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన శాసన మండలి వైస్ ఛైర్మన్ సహా బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.
Inavolu Mallanna Swamy Jatara In Hanamkonda : చారిత్రక క్షేత్రం ఐనవోలు ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఏటా నిర్వహించే ఉత్సవాల్లో మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి శాసన మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, హనమకొండ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ రైతు రుణవిమోచన కార్పొరేషన్ ఛైర్మన్ నాగూర్ల వేంకటేశ్వర్లు వచ్చారు.
సంక్రాంతి వేళ భక్త జనసంద్రంగా మారిన ఐనవోలు, కొత్తకొండ ఆలయాలు
BRS Leaders Inavolu jatara Tickets issue : మల్లన్న దర్శనం కోసం వెళ్లే క్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు వారిని అడ్డుకున్నారు. దర్శనం టికెట్ చూపాలని కోరారు. అధికారులు సూచించడంతో డీసీసీబీ ఛైర్మన్ రవీందర్‌రావు రూ.50 వేలతో 100 టికెట్లను కొనుగోలు చేశారు. అవి చూపినప్పటికీ పాలకులు, పోలీసులు, దేవాదాయశాఖ అధికారులు ముఖద్వారం వద్ద తాళం వేసి అరగంట సమయం వారిని నిలిపివేశారు. అనంతరం ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వామివారిని బీఆర్ఎస్ నేతలు దర్శించుకున్నారు.
ఐనవోలు మల్లన్న స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ఎర్రబెల్లి పూజలు
Inavolu Mallanna jatara : గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదని, ప్రసుత్తం అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యుల తీరుతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనిపైన దేవస్థానం ఈవోను వివరణ కోరగా జాతరకు వచ్చిన ప్రముఖులు ఎవరైనా స్వామివారి దర్శనానికి రూ. 500 టికెట్ కొనుగోలు చేయాలని దేవస్థాన అధికారులు, పాలకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం స్థానిక ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో తీర్మానించినట్లు చెప్పారు. ఈ మేరకే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నట్లు, టికెట్లు చూపాలని కోరినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వివరణ ఇచ్చారు.
Errabelli at Inavolu Mallanna jatara : ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
Errabelli at Inavolu Mallanna jatara : ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి