ETV Bharat / state

Boy Killed in School Bus Accident Hanamkonda : స్కూల్ వ్యాన్ కింద పడి మూడేళ్ల బాలుడు మృతి - స్కూల్ వ్యాన్ కింద పడి మూడెళ్ల బాలుడు మృతి

Boy Killed in School Bus Accident Hanamkonda : హనుమకొండలోని భీమదేవరపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బడికి వెళ్తున్న మూడేళ్లో బాలుడు ప్రమాదవశాత్తు స్కూల్ వ్యాన్​ కింద పడి మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

3 years Old Boy
3 years Old Boy Died In Road Accident
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 1:28 PM IST

Updated : Aug 29, 2023, 2:28 PM IST

Boy Killed in School Bus Accident Hanamkonda : ఈ మధ్య కాలంలో తరచూ గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ వ్యాన్​లు, బస్సుల కింద పడి అభం శుభం తెలియని చిన్నారులు మృతి చెందుతున్నారు. ఇది వరకే ఇలాంటి ప్రమాదాలు జరిగినా పునరావృతం (Road Accidents) కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడానికి పిల్లల్ని బయటకు తీసుకువెళుతున్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా లేక వారు చర్యలు తీసుకున్న ప్రజల్లో ఉనికి లేకపోవడమో కానీ ఎంతో జీవితాన్ని అనుభవించాల్సిన చిన్నారులు కానరాని లోకాలకు వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి మరో ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది.

3 year Old Boy Crushed Under School Bus Warangal : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో చంటయిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల బాలుడు శివాన్ష్ ప్రమాదవశాత్తు స్కూల్ ​వ్యాన్ కింద పడి మృతి చెందాడు. బాలుడి మరణంతో అతడి కుటుంబంలోనే కాకుండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజూలాగే పిల్లలిద్దరిని స్కూల్ వ్యాన్​ ఎక్కించడానికి వెళ్లింది ఆ తల్లి. పెద్దకుమారున్ని స్కూల్​ వ్యాన్​ ఎక్కిస్తుండగా అక్కడే ఉన్న తన చిన్నకుమారుడు శివాన్ష్ ప్రమాదవశాత్తు స్కూల్​ వ్యాన్​ టైర్​ కింద పడి మృతి చెందాడు.

College Bus Hits GHMC Worker Hyderabad : కాలేజ్ బస్సు ఢీకొని GHMC కార్మికురాలు మృతి.. వీడియో వైరల్

3 Year Old Boy Killed in School Bus Accident Hanamkonda : కండ్లెదుటే అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్న కుమారుడు దుర్మరణం చెందడంతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి స్కూస్ వ్యాన్​ను సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. డైవర్​ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నమన్నారు స్కూల్ వ్యాన్ల కింద పడి చిన్నపిల్లలు గాయాల పాలవ్వడం, దుర్మరణం చెందడం లాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న సందర్భంలో స్కూల్ వ్యాన్ నడిపేటప్పుడు డ్రైవర్లు, పర్యవేక్షకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలని రోడ్లపైకి తీసుకువచ్చినప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

3 Year Old Boy Killed in School Bus Accident Warangal Today : ఇలా చిన్నారుల అకాల మరణాలతో కన్నవారు శోకసంద్రంలో మునుగుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఉదయం పిల్లలు బడులకు వెళ్లే సమయాల్లో జరగడం గమనార్హం. ఆ సమయాల్లో స్కూల్​కు వెళ్లాలనే తొందరలో ఓవైపు విద్యార్థులు.. పిల్లలను సమయానికి పాఠశాలకు చేర్చాలనే తొందరలో డ్రైవర్లు ఉండటంతో.. దానికి నిర్లక్ష్యమూ కలిసి ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. బడికి ఆలస్యమవుతుందనే తొందరలో పిల్లలు ఏవైపు ఏ వాహనం వస్తుందో చూసుకోకుండా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇవే కాక పిల్లలను స్కూల్ బస్సు వద్ద దింపడానికి తల్లిదండ్రులతో పాటు ఆ పిల్లల చెల్లె/తమ్ముడు వెంట వస్తున్నారు. తమ అక్కా/అన్నలను తల్లిదండ్రులు బస్ ఎక్కించే సమయంలో చూసుకోకుండా ఆ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా పిల్లలను బస్సు ఎక్కించడానికి తల్లిదండ్రులు తమ వెంట తీసుకెళ్తున్న మిగతా పిల్లలు ప్రాణాలు పోయిన ఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా చిన్న పిల్లలు వారికి రోడ్లపై ఎలా నడవాలి అన్న విషయంపై వారికి అవగాహన ఉండకపోవడం కూడా ప్రమాదాలు సంభవించడానికి ఒక కారణమని అధికారులు అంటున్నారు.

School Bus Overturned : బస్సు నిండా విద్యార్థులు.. ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా.. లైవ్​ వీడియో

Viral Video Road Accident in Hyderabad : ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వ్యక్తి మృతి.. సీసీటీవీ ఫుటేజ్​ వైరల్​

Last Updated : Aug 29, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.