మహిళలు భక్తిశ్రద్ధలతో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట విష్ణుపురిలోని శివశక్తి మహంకాళి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆడపడుచులు బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లతో ఊరేగింపు సందడిగా జరిగింది. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః సాయంత్రానికి జూరాలను చేరనున్న కృష్ణమ్మ