వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుట్టమన్నుతో గౌరమ్మను తయారుచేసి వివిధ రకాల పూలతో అలకరించి మహిళలంతా కొలిచారు. బొడ్డెమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ... బతుకమ్మ ఆటలతో ఉల్లాసంగా గడిపారు. 9 రోజుల పాటు ఆడిన బొడ్డెమ్మను చివరి రోజు నిమజ్జనం చేస్తామని మహిళలు చేబుతున్నారు. తెలంగాణ సాంప్రదాయాలను తమ తర్వాతి తరాలకు కూడా తెలియజేసేందుకు ఈ పండగను ఘనంగా జరుపుకుంటామంటున్నారు హన్మకొండ వాసులు.
ఇదీ చూడండి: కదిలే సంగీత నిలయం ఆ రైలు...