వరంగల్ అర్బన్ జిల్లా దేశాయిపేటలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. గుప్త నిధుల కోసం.. గత కొన్ని రోజులుగా పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
పూజల అనంతరం తవ్వకాలు జరపడం వల్ల ప్రహరీగోడ నేలకూలడంతో విషయం బయటకు పొక్కింది. స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోకేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గోవింద్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు