ETV Bharat / state

వరంగల్​ కలెక్టరేట్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బీజేవైఎం ముట్టడి భగ్నం - బీజేవైఎం నాయకుల అరెస్టు తాజా వార్త

ప్రైవేటు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ వరంగల్​లో బీజేవైఎం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా అందరినీ ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

bjym leaders siege warangal Collectorate police arrested those leaders
వరంగల్​ కలెక్టరేట్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బీజేవైఎం ముట్టడి భగ్నం
author img

By

Published : Oct 19, 2020, 2:43 PM IST

కరోనా వల్ల వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ బీజేవైయం డిమాండ్​ చేసింది. హన్మకొండలోని వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లా కలెక్టరేట్‌లను బీజెవైఎం నాయకులు ముట్టడించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు, బీజెవైఎం శ్రేణులకు తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.

వరంగల్​ కలెక్టరేట్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బీజేవైఎం ముట్టడి భగ్నం

కలెక్టరేట్‌ గేటు ఎక్కిన కొందరు నేతలను పోలీసులు కిందకు లాగేశారు. వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని స్టేషన్​కు తరలించారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు అధ్యాపకలు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని నినాదులు చేశారు.

ఇదీ చూడండి: 'ఫార్మా కంపెనీల పేరుతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.