రోజురోజుకు రైతుల పరిస్థితి దిగజారుతోందే తప్ప మెరుగుపడటం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతకు మేలు చేసేందుకే కేంద్రం నూతన సాగు చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. వీటిపై అవగాహన లేకుండా.. విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో బోర్డుల వ్యవస్థను రద్దు చేసి క్లస్టర్ వ్యవస్థను తీసుకువస్తామని స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలతో సీఎం కేసీఆర్కు ఏం నష్టమని అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్.. తన ఫాంహౌస్లో పండించిన పంటలను కార్పొరేట్లకు అమ్ముకోవచ్చుకానీ.. రైతులు మాత్రం అమ్ముకోకూడదా అని నిలదీశారు.
- ఇదీ చూడండి : 'విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎన్నో మైలురాళ్లు దాటాం'