వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. దళితులకు మూడెకరాల భూమిని కేటాయించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టివేసుకున్నారు.
అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని కోరారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మభ్య పెడుతుందని భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న భాజపా శ్రేణులు పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: సంక్రాంతి వెతలు: ప్రయాణం ఏదైనా.. దోపిడి మామూలే!