హన్మకొండలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ బస్టాండు ఎదుట నిరసనకు దిగారు. విద్యార్థులకు అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్టాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యథావిధిగా బస్సులు నడిపిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి: నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన భాజపా