ETV Bharat / state

Bathukamma Sarees : చారిత్రక ఓరుగల్లులో బతుకమ్మ చీరల తయారీ - bathukamma sarees designing in warangal urban district

దసరా వచ్చిందంటే తెలంగాణ ఆడపడుచులకు ముందుగా గుర్తొచ్చేది బతుకమ్మ చీరలు(Bathukamma Sarees). బతుకమ్మ పండుగకు సర్కార్ ఇచ్చే కానుకే ఈ బతుకమ్మ చీరలు. అధునాతన డిజైన్లతో అలరించే రంగుల్లో ఈ చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరో రెండు నెలల్లో సద్దుల బతుకమ్మ పండుగ రానున్నందున ..ఇంద్రధనస్సు రంగుల్లో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి.

చారిత్రక ఓరుగల్లులో బతుకమ్మ చీరల తయారీ
చారిత్రక ఓరుగల్లులో బతుకమ్మ చీరల తయారీ
author img

By

Published : Aug 10, 2021, 12:41 PM IST

చారిత్రక ఓరుగల్లులో బతుకమ్మ చీరల తయారీ

బంగారు బతుకమ్మ పండుగకు తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరల(Bathukamma Sarees)ను కానుకగా అందించడం ఆనవాయితీ. తీరొక్క డిజైన్లలో.. అలరించే రంగుల్లో ఉండే ఈ చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా.. బతుకమ్మ చీరలు ఎప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే తయారయ్యేవి. కానీ.. ఈ సారి ఓరుగల్లులోనూ వీటిని రూపొందిస్తున్నారు.

ఇప్పుడు ఓరుగల్లులోనూ..

సిరిసిల్లలో తయారయ్యే బతుకమ్మ చీరలు(Bathukamma Sarees)... ఇప్పుడు ఓరుగల్లులోనూ రూపుదిద్దుకుంటున్నాయి. చూడచక్కని డిజైన్లతో నేత కార్మికులు వీటిని తయారు చేస్తున్నారు. మడికొండ వద్ద ఉన్న కాకతీయ మినీ జౌళి పార్కుకు పన్నెండున్నర లక్షల మీటర్ల భారీ ఆర్డర్‌ రావడంతో... ఉత్సాహంగా చీరలను నేస్తున్నారు. మరో రెండు నెలల్లో బతుకమ్మ పండగ వస్తోంది. బతుకమ్మ వేడుకకి ఆడపడుచులకు కానుకగా ఇచ్చేందుకు ఈ చీరలు సిద్ధమవుతున్నాయి.

40కి పైగా యూనిట్లలో..

మడికొండ వద్ద ఉన్న కాకతీయ మినీ జౌళి పార్కుకు ప్రభుత్వం పన్నెండున్నర లక్షల మీటర్ల భారీ ఆర్డర్ ఇచ్చింది. చేనేత కళాకారులు హుషారుగా చీరలను నేస్తున్నారు. రాష్ట్రంలో పని దొరక్క మహారాష్ట్ర భీవండి సహా ఇతర ప్రాంతాలకు కార్మికులు వలస వెళ్లేవారు. అలాంటి వారిని ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చి ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వ సాయంతో మడికొండలోని 66 ఎకరాల్లో మొత్తం 364 యూనిట్లు ఏర్పాటు చేశారు. 40కి పైగా యూనిట్లలో ప్రస్తుతం బతుకమ్మ చీరలు(Bathukamma Sarees) నేస్తున్నారు. ఆకట్టుకునే రంగల్లో తయారవుతున్న బతుకమ్మ చీరలు....త్వరలోనే మహిళలకు అందనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.