లాక్డౌన్ వల్ల ఇంటి నుంచి కాలు బయట పరిస్థితి. కిరాణా షాపులు తప్ప అన్ని దుకాణాలు మూతపడ్డాయి. లాక్డౌన్ రోజుల్లో జుట్టు పెరిగిన వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. కొందరికి కాస్తా జుట్టు పెరిగిన చికాకు అనిపిస్తుంది.
క్షవరం కోసం ఎదురుచూస్తున్న వారి బాధలను అర్థం చేసుకుని ఇంటి వద్దకే వెళ్లి కటింగ్ చేయిస్తున్నాడు వరంగల్ చెందిన ఓ బార్బర్. హన్మకొండలో సెలూన్ దుకాణాదారుడు నరేందర్‌కు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వచ్చి క్రాఫ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ముఖానికి మాస్క్ ధరించి స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇదీ చదవండి: సొంతూరి కన్నా ఇక్కడే బాగుంది సార్..