దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ హన్మకొండలోని ఆంధ్రాబాంక్ ఎదుట విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. అన్ని బ్యాంకుల్లో వెంటనే ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను దెబ్బతీసేందుకు విలీనం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః పీఎంసీ కుంభకోణం: ఆర్బీఐ ఎదుట నిరసనల వెల్లువ