వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పోచంకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ ప్రారంభించారు. మొదటి టీకాను ఆసుపత్రిలో పనిచేస్తున్న అటెండర్ చందుకు వేశారు. కరోనాను అరికట్టడానికి వ్యాక్సిన్ రావడం శుభపరిణామమని ఆయన అన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాకు 2,700 వ్యాక్సిన్లు వచ్చాయని వినయభాస్కర్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని.. టీకాతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ టీకా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఛీప్ విప్ వెల్లడించారు. తొలి రోజు ముగ్గురు ఆశావర్కర్లు టీకా వేయించుకున్నారని వివరించారు.
ఇదీ చూడండి : ఈ సమయం కోసమే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది : గవర్నర్