Dussehra Arrangements At Bhadrakali Temple: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ధ్వజారోహణముతో ప్రారంభమయ్యే ఉత్సవాలకు వేదపండితులు అంకురార్పణ చేశారు. అమావాస్య ఆదివారం కలిసి రావడంతో అర్చకులు అమ్మవారిని పసుపుతో అందంగా అలంకరించారు. పసుపు వర్ణంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. ప్రతి ఏటా పోల అమావాస్య రోజున శృంగేరిలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో అదే తరహాలో గత రెండు సంవత్సరాలుగా భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అలంకరణ చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు.
మరోవైపు కరోనా తర్వాత ఏపీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తిస్థాయి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ ఉత్సవాల నిర్వహణకు చేస్తోన్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల 26 నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు పది రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం.
ఇవీ చదవండి: ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. కరోనా తరువాత తొలిసారిగా..
'11 మంది సంతానం.. ఎవరూ పట్టించుకోవట్లేదు.. అనుమతిస్తే చనిపోతా'