వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కేరళకు చెందిన కెటెక్స్ కంపెనీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మెగా ప్రాజెక్టులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వివిధ కంపెనీల ప్రతిపాదనలను ఉపసంఘం పరిశీలించింది. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించిన సబ్ కమిటీ.. అందులో కొన్నింటికి ఆమోదం తెలిపింది. అందులో కెటెక్స్ కంపెనీ సహా ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రూ.వెయ్యి కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు కెటెక్స్ కంపెనీ ముందుకొచ్చింది. ప్రభుత్వ విధానాలు, టీఎస్-ఐపాస్‌కు అనుగుణంగా కంపెనీ ప్రతిపాదనలు, రాయితీలకు ఆమోదముద్ర వేసింది. మిగతా మరికొన్ని టెక్స్టైల్ సహా ఇతర ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: Vaccination: ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్‌కు స్పందన కరవు.. వందశాతం అయ్యేదెప్పుడు..?