వరంగల్ పట్టణ జిల్లాలో మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ప్రాథమిక సంబంధీకులు 104 మంది నమూనాలు నెగిటివ్ వచ్చాయి. మరో 138 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఫలితాలు రావచ్చని అధికారులు చెబుతున్నారు. జిల్లాకు సంబంధించి పాజిటవ్ వచ్చినవారంతా గాంధీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఎంజీఎంలో ఐసోలేషన్ వార్డులో నలుగురు ఉన్నారు. జిల్లాలో రెండో రోజు 39 మంది టెలీమెడిసిన్ ద్వారా సేవలను పొందారు.
లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చే వాహనదారులను కట్టడి చేయడం కోసం సిటీజన్ ట్రాకింగ్ అప్లికేషన్ను వినియోగిస్తున్నారు. సదరు వాహనదారుడు ఎన్నిసార్లు రోడ్లమీదకు వచ్చాడు, ఎన్ని చెక్ పాయింట్లు దాటాడన్నది ఆ అప్లికేషన్ ద్వారా తెలుస్తుంది. లాక్డౌన్ను ఉల్లంఘించి బయట తిరిగే వారిని పూర్తిగా నియంత్రించవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబూబాద్, జనగామ జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఇదీ చూడండి : లాక్డౌన్ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చమురు విక్రయాలు