ETV Bharat / state

ఎమ్మెల్సీ, పుర పోరుకు పార్టీలు సిద్ధం

ఎన్నికల వేడి మొదలైంది. ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే నల్గొండ వరంగల్‌ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే ఏడాది మార్చిలో వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఎన్నికలు సైతం జరగనున్నాయి. దీంతో అధికార పక్షం తెరాసతోపాటు, విపక్షాలు ఎన్నికల వ్యూహ రచనలో ఇప్పటి నుంచే తలమునకలవుతున్నాయి. మరోవైపు కొందరు ఆశావహులు తమకే ఆయా టిక్కెట్లు దక్కుతాయన్న ఊహల్లో మునిగితేలుతున్నారు.

all parties prepare for mlc elections in telangana
ఎమ్మెల్సీ, పుర పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు
author img

By

Published : Oct 5, 2020, 1:54 PM IST

ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ రాజధాని హైదరాబాద్‌లో, రాష్ట్రంలో వరుసగా జరిగే వివిధ ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు శనివారం దిశానిర్దేశం చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధినేత కేసీఆర్‌ పట్టభద్రుల ఎన్నికతోపాటు, గ్రేటర్‌ వరంగల్‌ పోరులో తగిన వ్యూహంతో ముందుకెళ్లాలని, ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు గ్రేటర్‌లో అత్యధిక డివిజన్లలో పార్టీ జెండా ఎగురవేసేలా ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసి కృషి చేయాలని హిత బోధ చేశారు.

తెరాస నుంచి పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌కు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. మళ్లీ ఆయనకే అవకాశం దక్కుతుందా లేదా మరొకరికి పార్టీ అవకాశం కల్పిస్తుందా అనే దానిపై అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఉమ్మడి వరంగల్‌కు చెందిన మరికొందరు ఆశావహులు సైతం తమకు అవకాశం ఇవ్వాలని పార్టీని కోరుతున్నట్టు సమాచారం. దీనిపై అనేక కోణాల్లో పరిశీలించి తెరాస అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. ఓటరు నమోదు కార్యక్రమాన్ని మాత్రం విస్తృతంగా చేసి పెద్ద సంఖ్యలో పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు ఆ దిశగా కదులుతున్నారు.

ఇప్పటికే జిల్లా మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ తదితరులు నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిపి పట్టభద్రుల ఎన్నికపై చర్చించుకున్నారు. మరో వైపు బల్దియా ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌లో పలు సడలింపులు ఇచ్చింది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలను తెరాస ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. ఇక్కడి కన్నా హైదరాబాద్‌ బల్దియా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఉమ్మడి వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులకు భాగ్యనగరంలోని డివిజన్ల బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని సమాచారం. అక్కడ ఎన్నికల్లో పనిచేసిన అనుభవంతో వరంగల్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలనే వ్యూహంతో పార్టీ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఇతర పార్టీలూ సిద్ధం

కాంగ్రెస్‌, భాజపాతోపాటు ఇతర పార్టీలు సైతం ఎమ్మెల్సీ, బల్దియా ఎన్నికల కోసం పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు సమన్వయ కమిటీ వేయాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా నేతలు ఇందుకు సిద్ధమవుతున్నారు. ఓటరు నమోదు కోసం ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ కూడా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండే విధంగా కాంగ్రెస్‌ సైతం సిద్ధమవుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు బూత్‌ స్థాయి కమిటీలను సైతం పటిష్ఠపరిచే దిశగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. మరో వైపు అధికార తెరాస వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది.

భాజపా సైతం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది. ఈ పార్టీ నుంచి పలువురు ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు పట్టభద్రుల టికెట్‌ ఆశిస్తుండగా, ఖమ్మం, నల్గొండ జిల్లాల వారికి పార్టీ అవకాశం ఇస్తుందా లేక ఉమ్మడి వరంగల్‌ నేతను బరిలో నిలుపుతుందా అనేదానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌తోపాటు మరికొన్ని అంశాల్లో ప్రజల్లోకి వెళ్లి పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక భాజపా కొత్తవారి చేరికలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధాన పార్టీలతోపాటు నల్గొండ వరంగల్‌ ఖమ్మం స్థానం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు ఆశావహులు తాము బరిలో ఉంటామని చెబుతున్నారు. ఇక నుంచి ఉమ్మడి జిల్లాలో వచ్చే కొన్ని నెలలు మాత్రం ఎన్నికల సందడి కొనసాగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.