కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని ఎంసీపీఐటీయూ పాలిట్బ్యూరో సభ్యులు మద్దికాయల అశోక్ డిమాండ్ చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వలస అసంఘటిత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న చట్టాలను మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని దుయ్యబట్టారు.
నూతన చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని ఎద్దేవా చేశారు. కార్మికుల చట్టాలు నిర్వీర్యం చేస్తే కార్మిక సంఘాలు, ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐసీటీయూ ఆధ్వర్యంలో ఎంసీపీఐ పార్టీ కార్యాలయంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈకార్యక్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లా, అర్బన్జిల్లాకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి: గుడి నిర్మాణం అడ్డుకున్న పోలీసుల.. గ్రామంలో ఉద్రిక్తత