ETV Bharat / technology

ఐఫోన్ SE 4లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుందా?- స్పెక్స్​, డిజైన్, ధర వివరాలివే! - IPHONE SE 4 LATEST LEAK

ఊహించని అప్​గ్రేడ్​తో ఐఫోన్ SE 4- లీకైన రెండర్స్​లో స్పెక్స్ వివరాలు మీకోసం!- ఓ లుక్కేయండి మరి!

Leaked Dummy Pictures of iPhone SE 4
Leaked Dummy Pictures of iPhone SE 4 (Photo Credit- Sonny Dickson)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 22, 2025, 3:22 PM IST

iPhone SE 4 Latest Leak: భారత్​తో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఐఫోన్ SE 4 కోసం ఎదురు చూస్తున్నారు. యాపిల్ చివరిసారిగా ఈ లైనప్​లో ఐఫోన్‌ను 2022లో విడుదల చేసింది. దీన్ని ఐఫోన్ SE 3 అనే పేరుతో తీసుకొచ్చింది. ఈ లైనప్‌లోని ఫోన్‌లు చాలా పాత డిజైన్‌, ఫీచర్లను కలిగి ఉండేవి. కానీ ఈసారి యాపిల్ తన స్ట్రాటజీని మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొంగొత్త డిజైన్, కొన్ని లేటెస్ట్ ఫీచర్లతో ఐఫోన్ SE 4ని విడుదల చేయొచ్చు. గత కొన్ని వారాలుగా ఈ ఫోన్​పై చాలా లీక్స్ వస్తున్నాయి. తాజాగా మరో లీక్ వచ్చింది. దీని ప్రకారం 'డైనమిక్ ఐలాండ్' ఫీచర్ ఈ అప్​కమింగ్ ఐఫోన్ మోడల్‌లో కన్పిస్తుంది.

ఐఫోన్ SE 4 రెండర్స్ లీక్: ఫోన్ గురించి సమాచారాన్ని అందించే టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్, తన ప్రైవేట్ ఎక్స్ అకౌంట్​లో ఐఫోన్ SE 4 పాసిబుల్ డిజైన్ రెండర్స్​ను పంచుకున్నారు. ఈ రెండర్స్​లో ఫోన్ టాప్ డిస్​ప్లేలో స్టాటిక్ నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్ కన్పిస్తుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ అనేది ఐఫోన్ డిస్​ప్లే టాప్​-సెంటర్​లో క్యాప్సూల్-సైజ్​లో నాచ్‌ను కలిగి ఉండి లాక్ స్క్రీన్‌లో కూడా నోటిఫికేషన్స్ లేదా అలెర్ట్స్ వంటి వాటిని అందిస్తుంది. 2022లో యాపిల్ ఈ ఫీచర్‌ను మొదటిసారిగా ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఫోన్‌లలో చేర్చింది.

Leaked Renders of the Upcoming iPhone SE 4 and iPad
Leaked Renders of the Upcoming iPhone SE 4 and iPad (Photo Credit- X.com/Evan Blass (@evleaks))

ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 16లో కూడా ఈ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కనిపించింది. కానీ ఈ ఫీచర్ ఇంతకు ముందు ఐఫోన్ SE మోడల్‌లలో ఎప్పుడూ కనిపించలేదు. అయితే ఈ ఫీచర్​ను మొదటిసారిగా ఐఫోన్ SE 4లో చూడొచ్చు. టిప్​స్టర్​ షేర్​ చేసిన రెండర్స్​లో ఐఫోన్ SE 4 తో పాటు M3 చిప్‌సెట్‌తో ఐప్యాడ్ ఎయిర్ 11 అండ్ 13-అంగుళాల వేరియంట్‌ల రెండర్స్​ కూడా కనిపిస్తాయి. ఇది 11వ జనరేషన్ ఐప్యాడ్ కావచ్చు.

ఇక ఐఫోన్ SE 4 విషయానికొస్తే పాత లీక్స్​లో కొన్ని డమ్మీ పిక్చర్స్ కూడా కనిపించాయి. వీటి ప్రకారం యాపిల్ ఈ చౌకైన ఐఫోన్​ను బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లతో లాంఛ్ చేయొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ సైడ్స్ ఫ్లాట్​గా ఉంటాయి. ఫోన్ ఎడమ వైపున సిమ్ ట్రేతో పాటు వాల్యూమ్ బటన్లు, మ్యూట్ స్విచ్ ఉండొచ్చు. ఫోన్ వెనక భాగంలోని లెఫ్ట్​ సైడ్​లో ఒకే కెమెరా సెన్సార్ కన్పిస్తుంది. ఇది LED ఫ్లాష్ లైట్‌తో రావొచ్చు.

అంచనా ఫీచర్లు: వీటితో పాటు లీకైన కొన్ని పాత నివేదికల ప్రకారం ఈ ఐఫోన్ SE 4 మోడల్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వాటర్‌ప్రూఫ్ బిల్డ్ బాడీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.06-అంగుళాల ఫుల్ HD ప్లస్ LTPS OLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఇక ప్రాసెసర్ కోసం ఇందులో A18 బయోనిక్ చిప్‌సెట్‌ను అందించొచ్చు. ఈ ఫోన్​ను 6GB అండ్ 8GB RAM సపోర్ట్​తో లాంఛ్ చేయొచ్చు. దీనితో పాటు ఐఫోన్ SE 4 మోడలలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, ఫేస్ ఐడి సపోర్ట్ కూడా ఇవ్వొచ్చు.

రిలీజ్ ఎప్పుడంటే?: యాపిల్ ప్రతిసారీ మార్చి-ఏప్రిల్ నెలలో తన SE మోడళ్లను లాంఛ్​ చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా కంపెనీ ఈ ఫోన్​ను మార్చి లేదా ఏప్రిల్‌లో రిలీజ్ చేయొచ్చు.

ధర ఎంతంటే?: ఈ ఫోన్ ధర USలో $500 (సుమారు రూ. 42,000). దక్షిణ కొరియాలో KRW 8,00,000 (సుమారు రూ. 46,000) కంటే ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రకారం ఈ ఐఫోన్‌ ధర భారతదేశంలో కూడా రూ.45,000 నుంచి రూ. 50,000 మధ్య ఉండొచ్చు.

భారత్​లో మరో రెండు బెంజ్ కార్లు- వీటిని చూసి చూపు తిప్పుకోగలరా?- రేంజ్ కూడా సింగిల్ ఛార్జ్​తో 600కి.మీ!

నేడు ఆకాశంలో మహాద్భుతం- ఆరు గ్రహాల పరేడ్- జీవితంలో ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం!

టెలికాం యూజర్లకు అదిరే న్యూస్- ₹ 20 రీఛార్జ్​తో ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ యాక్టివ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.