ETV Bharat / state

పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి

accident in warangal urbon district
పట్టణ ప్రగతి పనుల్లో అపశ్రుతి
author img

By

Published : Mar 1, 2020, 11:54 AM IST

Updated : Mar 1, 2020, 1:20 PM IST

11:52 March 01

పట్టణ ప్రగతి పనుల్లో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి

పట్టణ ప్రగతి పనుల్లో అపశ్రుతి

అధికారుల నిర్లక్ష్యం పసి ప్రాణాన్ని బలిగొంది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోడ్​లోని హనుమాన్​నగర్​లో పట్టణ ప్రగతిలో భాగంగా జేసీబీతో మురికి కాలువలు శుభ్రం చేస్తుండగా పక్కన ఉన్న గోడ కూలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ప్రిన్సి అనే  7 సంవత్సరాల పాప అక్కడిక్కడే మృతి చెందగా పాప తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. బాబును ఎంజీఎం ఆస్పపతి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

డ్రైవర్ అజాగ్రత్తగా జేసీబీ నడపడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు. మృతరాలి తండ్రి  సాంబశివరావు వండ్రంగి పని చేస్తూ స్థానికంగా అద్దెకు ఉంటున్నారు. పిల్లలతో కలిసి బయటకు వెళ్లి చేపలు తీసుకుని ఇంటి లోపలికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చూడండి: దిల్లీ పాఠశాలలకు సెలవుల పొడిగింపు- పరీక్షలు వాయిదా

Last Updated : Mar 1, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.