ఇంటర్మీడియట్ బోర్డు తీరును నిరసిస్తూ వరంగల్‌లో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల వల్ల పరీక్షలు బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు ఆరోపించారు. దీనికి కారకులైన బోర్డు కార్యదర్శి అశోక్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ తప్పుల ఫలితాలకు నిరసనగా హన్మకొండ చౌరస్తాలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కొత్తగూడెం జిల్లాలో కర్రలతో కొట్టుకున్నారు