ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆందోళనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పట్టణ జిల్లా కేంద్రం హన్మకొండలోని కాళోజి కూడలి వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి...!