భారత్‌ను అత్యంత శక్తిమంతమైన దేశంగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని వరంగల్ లోక్‌సభ భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి అన్నారు. దేశ సంపదను కొల్లగొట్టిన కాంగ్రెస్ నేతలకు మోదీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సెంటిమెంట్ ద్వారాఅసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ అధికారం చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో భాజాపాకు తెరాసకు మధ్యనే పోటీ ఉందని... వలసలతో కాంగ్రెస్ నీరసించిపోయిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా భాజపా 350 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. ప్రచారంలో అనూహ్య స్పందన వస్తోందని వరంగల్ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి చూడండి:బంగాల్లో ఎన్ఆర్సీపై రాజకీయ రగడ