ETV Bharat / state

సికింద్రాబాద్‌లో రుద్రమ శక్తి.. వరంగల్‌లో భద్రకాళి శక్తి

Railway Rakshaka Dalam: మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడానికి రైల్వే రక్షక దశం 'శక్తి' పేరుతో ప్రత్యేక వ్యూహన్ని అమలు చేస్తోంది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే భద్రత దశం పరిధిలో నాగమ్మ శక్తి పేరుతో ఈ బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందానికి సికింద్రబాద్​లో రుద్రమ శక్తి, వరంగల్‌లో భద్రకాళి శక్తిగా పేర్లు పెట్టారు. ఈ బృందాలు రైళ్లలో ప్రయానికులా వెళుతూ ట్రాఫికింగ్​ను పసిగడతారు.

Kazipet Railway Security Force
Kazipet Railway Security Force
author img

By

Published : Dec 19, 2022, 10:37 AM IST

Formation of a team named Nagamma Shakti: మహిళలు, పిల్లల అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌)ను అరికట్టడానికి రైల్వే రక్షక దళం ‘శక్తి’ పేరుతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. కాజీపేట రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్‌) పరిధిలో నాగమ్మ శక్తి పేరుతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా ఎస్సైతో పాటు ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు సేవలందిస్తున్నారు. సికింద్రాబాద్‌లో ఈ బృందానికి రుద్రమ శక్తి, వరంగల్‌లో భద్రకాళి శక్తిగా పేర్లు పెట్టారు.

ఈ బృందాలు రైళ్లలో ప్రయాణికుల్లా వెళుతూ ట్రాఫికింగ్‌ను పసిగడతాయి. ఇటీవల ఒడిశా నుంచి 15 మంది పిల్లలను వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో పనిచేయించడానికి తీసుకొస్తుండగా, వారికి అవగాహన కల్పించి తిరిగి సొంత ఊళ్లకు పంపించి అక్కడ పాఠశాలల్లో చేరేలా చేశారు. ఆపరేషన్‌ మహిళా సురక్షలో భాగంగా.. రైళ్లలో రాత్రిపూట ఒంటిరిగా ప్రయాణం చేస్తున్న మహిళల జాబితాను ఆర్పీఎఫ్‌ అధికారులు ముందస్తుగా తయారు చేసుకుంటారు.

రాత్రిపూట వారి బెర్తు వద్దకు వెళ్లి ఏమైనా సమస్య ఎదుర్కొంటున్నారా? అని అడిగి తెలుసుకుంటారు. అవసరమైతే వారికి రక్షణగా ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. కాజీపేట, వరంగల్‌ పరిధిలో ఆర్పీఎఫ్‌ పరిధిలో గత ఏడాది కాలంలో 189 సందర్భాల్లో ఇలాంటి సేవలందించారు. ఈ విధానం అమలు కారణంగా 70 శాతం ట్రాఫికింగ్‌ తగ్గిందని సికింద్రాబాద్‌ సీనియర్‌ డివిజనల్‌ భద్రతాధికారి దెబాస్మిత సి బెనర్జీ వివరించారు. మొత్తంగా రైల్వే ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రతకు రైల్వే రక్షక దళ వ్యవస్థ 21 రకాల వ్యూహాలను అమలు చేస్తుండగా.. గత రెండు నెలలుగా వీటిని మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.