ETV Bharat / state

Sankranti Goats cart: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా మేకపోతుల బండి - మేకపోతుల బండి

Sankranti Goats cart: సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. పంటలు చేతికొచ్చిన ఆనందంతో జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. రైతులకు జీవనాధారమైన ఎద్దులు, మేకలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఎడ్లబండ్లను కట్టి ఊరేగింపు నిర్వహిస్తారు. కానీ పండుగ రోజు వీరభద్రస్వామి ఉత్సవాల్లో కొందరు రైతులు ఏర్పాటు చేసిన మేకపోతుల బండి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఎక్కడో జరిగిందో చూసేద్దాం రండి.

Sankranti Goats cart
మేకపోతుల బండి
author img

By

Published : Jan 16, 2022, 6:53 PM IST

Sankranti Goats cart: సంక్రాంతి పండుగ రైతులకు ఎంతో ప్రత్యేకం. పండుగ రోజు నాడు పశువులను అందంగా అలంకరిస్తారు. రైతులకు జీవనాధారమైన ఎద్దులు, మేకలు, గొర్రెలకు పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో అందంగా అలంకరించిన మేకపోతుల బండి పలువురిని ఆకట్టుకుంది. ఉత్సవాలను వీక్షించేందుకు వచ్చిన యువకులు మేకపోతులతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

ప్రతి ఏటా సంప్రదాయం

veerabhadra Swamy temple: ప్రతి ఏడాది తమ పూర్వీకుల్లాగే వేలేరు మండలం ఉప్పరపల్లి గ్రామం నుంచి వీరభద్ర స్వామి ఆలయానికి మేకపోతు బండ్లను తీసుకొచ్చే సాంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామని రైతులు తెలిపారు. వీరభద్ర స్వామివారి దయవల్ల తమకు తమ కుటుంబాలకు మంచి జరుగుతుందని చెప్పారు. తమ మేకల మందలు కూడా సురక్షితంగా ఉంటాయని వెల్లడించారు.

ప్రత్యేక అలంకరణతో ఎడ్లబండ్లు

Bull carts in Sankranti: అదేవిధంగా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి 58 ఎడ్లబండ్లను పువ్వులు, విద్యుద్దీపాలతో అలంకరించుకొని ఊరేగింపుగా వీరభద్ర స్వామి దేవాలయానికి తీసుకొచ్చారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఎడ్లబండ్లను ఆలయానికి ప్రదర్శనగా తీసుకువస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అలాగే తమ పాడి పంటలు, కుటుంబాలను ఆదేవుడు చల్లగా చూడాలని కోరుతూ ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటామని వెల్లడించారు. అర్ధరాత్రి వేళ ఆలయానికి చేరుకున్న మేకపోతు, ఎడ్లబండ్లు భక్తుల సందడి మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ఎడ్లబండ్ల ప్రదక్షిణలు భక్తులను, చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.