మొక్కలు నాటడంపై ప్రజల్లో ఆసక్తి పెంచేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వృక్ష జ్ఞాపిక వనం(green legacy) పేరిట విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.పుట్టిన రోజు, పెళ్లి రోజులతో పాటు తమ తల్లిదండ్రుల పేరిట ఎవరైనా వడ్డేపల్లి చెరువు కట్ట దిగువన మొక్కలు నాటొచ్చు. పండ్లు, పూల మొక్కలయితే ఒక్కో దానికి రూ.516, వేప, రావి, మద్ది తదితర మొక్కలకు 116 చెల్లిస్తే కార్పొరేషన్ అధికారులే వాటి సంరక్షణ చేపడతారు.
గతేడాది ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన వారి పేర్లతో బోర్డులు పెడతారు. ఇప్పటి వరకు ప్రజల పేరిట సుమారు 500 మొక్కలు నాటగా... ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ పేర్లతో మొక్కలు నాటారు. ఇంట్లో స్థలం లేనివాళ్లు కొద్ది మొత్తం చెల్లిస్తే ఇక్కడ మొక్క నాటవచ్చు. తమ పేరుతో నాటిన వృక్షం పెరిగి పెద్దయ్యాక చూసుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఇదీ చదవండి: GOVERNOR TAMILISAI: 75వ స్వాతంత్య్ర దినోత్సవం... దేశ చరిత్రలో గొప్పదినం