ETV Bharat / state

8 టన్నుల పండ్లు ఉచితంగా పంచిన వ్యాపారి.. - 8 టన్నులు పండ్లను పంపిణీ చేసిన వ్యాపారి

తన వ్యాపార ఎదుగుదలకి కారణమైన వరంగల్​ పట్టణ ప్రజలకు లాక్​డౌన్​ నేపథ్యంలో తన వంతు సాయం అందించాలని తలిచాడు ఓ వ్యాపారి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది టన్నుల పండ్లును ఉచితంగా పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.

A fruit merchant distributing 8 tonnes of fruits to the poor at Warangal Narsampet
వికసించిన సేవాగుణం.. పరిమళించిన దాతృత్వం.. 8 టన్నుల పండ్లు పంపిణీ
author img

By

Published : Apr 24, 2020, 4:36 PM IST

వికసించిన సేవాగుణం.. పరిమళించిన దాతృత్వం.. 8 టన్నుల పండ్లు పంపిణీ

చిన్న పండ్ల బండితో మొదలైన రాజమల్లు అనే యువకుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద పండ్ల వ్యాపారిగా ఎదిగాడు. వరంగల్​ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన రాజమల్లు చిన్నతనం నుంచే పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా పట్టణ ప్రజల సహాయంతో తాను పండ్ల వ్యాపారంలో ఎదుగుదలను సాధించాడు.

తన అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడిన పట్టణ ప్రజలకు ఈ కరోనా కష్టకాలంలో తన వంతు సాయం చేయాలని తలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది టన్నుల ద్రాక్ష, బత్తాయి పండ్లను పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. పట్టణంలోని 24 వార్డుల్లో ప్రజలకు వారివారి కౌన్సిలర్ల సాయంతో ఇంటింటికీ అందించడం కోసం స్థానిక రెడ్డి ఫంక్షన్​ హాల్లో పండ్లను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్​ హరితలు పాల్గొన్నారు. రాజమల్లు చేస్తున్న ఈ పనిని పలువురు అభినందించారు.

' నా ఎదుగుదల ఎంతగానో సాయం చేసిన వారికి నా వంతు సాయం చేసి వారి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పండ్లను ఇంటింటికీ కేజీ చొప్పున పంచుదామని నిర్ణయించుకున్నా- రాజమల్లు, పండ్ల వ్యాపారి'

తానే స్వచ్ఛందంగా పండ్లను పంపిణీ చేస్తానని ఎమ్మెల్యేకు చెప్పాడు. నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూ పండ్లను ప్యాకింగ్​ చేయించి పంపిణీ చేశాడు.. ప్రజల తాను చేస్తున్న సాయానికి మేము అభినందిస్తున్నాం- ఆకుల శ్రీనివాస్​ జిల్లాపరిషత్​ వైస్​ ఛైర్మన్​'

ఇదీ చూడండి: హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.