ETV Bharat / state

ఒంటి చేత్తోనే సాధిస్తానంటున్న మిథున

ప్రమాదంలో ఒక చెయ్యి పోయిందని ఆ అమ్మాయి అధైర్య పడలేదు. బాధపడుతూ ఇంటికి పరిమితం కాలేదు. ఆత్మవిశ్వాసంతో తనకిష్టమైన ఆటలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చక్కగా చదువుకుంటూనే... తనకున్న ఒక్క చేతితో బాస్కెట్‌బాల్‌లో ప్రావీణ్యం సాధిస్తోంది. మొక్కవోని దీక్షతో సాధన చేస్తున్న వరంగల్‌ చిన్నారిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

mithuna
mithuna
author img

By

Published : Jul 18, 2021, 7:36 PM IST

ఎన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నా... ఆత్మవిశ్వాసం లేకపోతే అనుకున్నది సాధించలేం. సాధించాలన్న పట్టుదల, అచంచలమైన నమ్మకం ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా దూదిపింజలా ఎగిరిపోతాయి. ఇందుకు చక్కని ఉదాహరణ వరంగల్‌కు చెందిన ఏడేళ్ల చిన్నారి మిథున. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కావాలనేది తన కల. తానొకటి తలిస్తే... విధి మరొకటి చేసింది. విద్యుదాఘాతంతో ఏడాది క్రితం మిథున కుడి చేయి కోల్పోయింది. ఎడమ చేతి మూడు వేళ్లూ కాలిపోయాయి. ఆస్పత్రిలో చాలా రోజులు చికిత్స తీసుకుని కోలుకుంది. చేయి లేకపోవడం వల్ల బాస్కెట్‌బాల్‌పై ఇష్టాన్ని వదులుకోమని చాలామంది చెప్పిచూశారు. కానీ ఎవరెంత చెప్పినా వినకుండా.... బాస్కెట్‌బాల్‌ శిక్షణ పొందుతోంది. వేకువజామునే వరంగల్​లోని జేఎన్​ఎస్​ మైదానానికి వెళ్లి... రెట్టించిన ఉత్సాహంతో సాధన చేస్తూ ఔరా అనిపిస్తోంది.

బాలిక పట్టుదలను చూసి.. కోచ్​ ప్రత్యేక శిక్షణ

మిథున పట్టుదలను గమనించిన బాస్కెట్ బాల్ కోచ్‌ ప్రశాంత్‌... ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. చిన్నారి కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించి మెలకువలు నేర్పిస్తున్నారు.

'మిథున చాలా కష్టపడుతుంది. కొన్ని మెలకువలు కూడా నేర్చుకుంది. చెయ్యి లేదు అనే ఫీలింగ్​ కూడా లేదు. నేను ఏది చేసి చూపిస్తే తాను అది చేస్తుంది. తన పట్టుదలను చూసి ప్రతి రోజు తెల్లవారుజాము 6గంటలకు గ్రౌండ్​కు వచ్చి నేర్పిస్తున్నా.. నాకంటే ముందే గ్రౌండ్​కు వచ్చి సిద్ధంగా ఉంటుంది. దివ్యాంగులు ఏమీ చేయలేమనే భయం వద్దు. ఇప్పుడు పారా ఒలింపిక్స్​ కూడా ఉన్నాయి. ఎవరైనా నేర్చుకోవాలి అనుకునేవారికి ఉచితంగా శిక్షణ కూడా ఇస్తాం.'

- ప్రశాంత్, శిక్షకుడు

ఆమె బంగారు భవిష్యత్తుకు అండగా ఉంటాం

భవిష్యత్తులో మిథున గొప్ప క్రీడాకారిణిగా ఎదగాలని కోచ్ సహా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. విద్యుదాఘాతంతో మిథున చేయి కోల్పోయినప్పటికీ... దివ్యాంగులకు ఇచ్చే ధ్రువపత్రం ఇంకా అందలేదని తల్లిదండ్రులు వాపోయారు.

'ఏడాది క్రితం ఇంటిపైన ఆడుకుంటున్న సమయంలో విద్యుదాఘాతం జరిగింది. ప్రమాదంలో కుడి చెయ్యితో పాటు, ఎడమ చేతిలో మూడు వేళ్లు దెబ్బతిన్నాయి. చాలా ఆస్పత్రులు తిప్పాము. కోలుకున్న తర్వాత ఆమె ఏమాత్రం కుంగిపోకుండా బాస్కెట్​ బాల్​ నేర్చుకుంటానని చెప్పింది. ఛాంపియన్​ కావాలనేది తన కల. తన పట్టుదలను చూసి 6 నెలలుగా గ్రౌండ్​కు తీసుకొస్తున్నాం. ఒంటి చేత్తోనే స్వతహాగా గోల్​ వేయగలుగుతుంది. గేమ్​ ఆడగలుగుతుంది. ఆమె బంగారు భవిష్యత్తుకు మావంతు సాయం అందిస్తాం. -

నరేశ్​, మిథున తండ్రి

ఇదీ చూడండి: బిడ్డల ఆకలి తీర్చలేని స్థితిలో దాతల సాయం అర్థిస్తున్న మాతృమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.