ETV Bharat / state

చాయ్​వాలకు ప్రధానితో మాట్లాడే అవకాశం.. ఎలా వచ్చిందంటే..! - తెలంగాణ తాజా వార్తలు

దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం రావడం...సాధారణ విషయమేమి కాదు. అందుకే ఆ చాయ్ వాలా చాలా సంతోషపడుతున్నాడు. మోదీ నాతో మాట్లాడతారంటూ... పదిమందికి చెబుతూ ఆనందపడిపోతున్నాడు. నరేంద్రమోదీతో మాట్లాడే అపురూప క్షణాల కోసం ఎదురుచూస్తున్నాడు వరంగల్​ ఎంజీఎం ప్రాంతానికి చెందిన మహమూద్​పాషా.

chai wala
chai wala
author img

By

Published : Jul 2, 2021, 8:07 PM IST

చాయ్​వాలకు ప్రధానితో మాట్లాడే అవకాశం.. ఎలా వచ్చిందంటే..!

వరంగల్ ఎంజీఎం ప్రాంతంలో... 18 ఏళ్లుగా టీకొట్టు నడుపుతున్న మహమూద్ పాషాకు చానాళ్ల క్రితం వరకు చాయ్​ బండి కూడా లేదు. కేవలం ఓ చిన్న టేబుల్​పైనే వ్యాపారం చేసుకునేవాడు. అయితే మెప్మా ద్వారా చిరువ్యాపారులకు రుణం వస్తుందను తెలుసుకుని దానికి అప్లై చేసుకున్నాడు. రూ.10 వేల లోన్​ వచ్చింది. లాక్​డౌన్​ సమయంలో కూడా ఒక్క వాయిదా ఆపకుండా చెల్లించాడు. ఇంతవరకు సాధారణంగానే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అతనికో ఫోన్​ వచ్చింది. ఆ తర్వాత అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంతకీ ఆ ఫోన్​ ఎక్కడి నుంచి వచ్చింది. అతని ఆనందానికి కారణం ఏమిటంటే..

టీ బండి నడిపించే పాషాకు దిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్​ వచ్చింది. జులై మొదటి వారంలో ప్రధాని మోదీ మీతో మాట్లాడతారు.. అందుకు సిద్ధంగా ఉండండని సమాచారం ఇచ్చారు. ఈ వార్త విన్న పాషా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. దేశ ప్రధాని తనతో మాట్లాడే సమయం కోసం ఆతృతగా వేచి చూస్తున్నాడు. పాషా తండ్రి అఫ్జల్ పాషా నలభై ఏళ్ల నుంచి ఇదే ప్రాంతంలో టీకొట్టు నడుపుతుండగా.... మహమూద్ పాషా కూడా దీనినే జీవనోపాధిగా ఎంచుకున్నాడు. చాయ్ అమ్ముతూనే ఇంటర్ వరకూ చదివాడు. ఫోన్ పే, గుగూల్ పే ద్వారా ఎక్కువ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. టీ కొట్టు నడిపే తనతో ప్రధాని మాట్లడగలిగే ఛాన్స్ రావడం... తన అదృష్టమని పాషా చెబుతున్నాడు.

చాలా సంతోషంగా ఉంది..

'చిరువ్యాపారులకు మెప్మాద్వారా రూ. 10వేలు లోన్​ ఇస్తున్నారని తెలుసుకుని అప్లై చేసుకున్నాను. లోన్​ వచ్చింది. అప్పటి వరకు నేను వ్యాపారం చేసుకునేందుకు చాయ్​ బండి కూడా లేదు. ఆ మొత్తంతో చాయ్​ బండి, ఇతర సామాను తీసుకున్నాను. లాక్​డౌన్​ వల్ల మూడు నెలలు పాటు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. లాక్​డౌన్​ సమయంలో కూడా వాయిదాలు ఆపకుండా చెల్లించాను. తర్వాత కొన్నిరోజులకు మెప్మా నుంచి ఫోన్​ వచ్చింది. మరో రూ.20వేలు లోన్​ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దిల్లీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్​ వచ్చింది. మీరు ప్రధాని మాట్లాడే అవకాశం పొందారు.. అందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. నేను ప్రధానితో మాట్లాడేందుకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను.

-మహమూద్​ పాషా, టీ వ్యాపారి.

ఇదీ చూడండి: Revanth Reddy : రూట్ మార్చి.. అంచనాలు పటాపంచలు చేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.