గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని విశాఖపట్నం నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి విద్యార్థులకు అమ్ముతున్నారని ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు తెలిపారు.
నిందితుల నుంచి 20 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులపై పీడీ యాక్టును నమోదు చేస్తామని వివరించారు. కమిషనరేట్‌ను గంజాయి రహితంగా తీర్చిదిద్దుతామని డీసీపీ నాగరాజు వెల్లడించారు.
ఇవీ చూడండి : భూమి కోసం తల్లీ కూతుర్ల ఆత్మహత్యాయత్నం