పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని తమ వ్యవసాయ భూమిని ఒక వ్యక్తి కబ్జా చేసాడని బోయిన్ పేటకు చెందిన కొంతం లక్ష్మి, స్వాతి అనే తల్లీ కూతుర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సర్వే నెంబర్ 992లో తమకున్న 20 గుంటల భూమిని కామోజ్జుల రామన్న కబ్జా చేసి, వారిని భూమిలోకి రానివ్వడం లేదని ఆ భూమి నాదే అని బెదిరిస్తున్నారని వారు వాపోయారు.
తమ తాతల నాటి నుంచి భూమికి సంబంధించిన అన్ని రికార్డులను తమ పేరు మీద ఉన్నాయని, అయినా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తమను రోజుల తరబడి తిపుతున్నారని.. అధికారులకు భూ రికార్డులను చూపించినా కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ వ్యవసాయ భూమిని భూస్వామి దున్నుతున్నడాని తెలుసుకుని, అదే వ్యవసాయ భూమిలో తల్లీ కూతుర్లు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై చల్లుకొని ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి వద్దనున్న కిరోసిన్ డబ్బాను స్వాధీనపరచుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!