వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన తెరాస నాయకులు ఉట్ల శ్యామ్ సుందర్‌రెడ్డి ఇటీవల మరణించారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆయన దశదిన కర్మకు హాజరయ్యారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పార్టీకి సేవలందించిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుందర్‌రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ