వరంగల్ గ్రామీణ జిల్లాలో ఈనెల 10 వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరణి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సంగెం, పర్వతగిరిలో పర్యటించిన కలెక్టర్.. ఆన్లైన్ నమోదు వేగవంతం పెంచేందుకు రెవెన్యూ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.
ఆస్తుల నమోదులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 10నాటికి డేటా ఎంట్రీ పూర్తి కావాలని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస యత్నం