ETV Bharat / state

'సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు' - రైతు సంక్షేమ పథకాలు

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో జడ్పీ ఛైర్​పర్సన్​ గండ్ర జ్యోతి రెడ్డి పర్యటించారు. మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

grain purchasing centers
grain purchasing centers
author img

By

Published : Apr 26, 2021, 6:29 PM IST

రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్​పర్సన్​ గండ్ర జ్యోతి రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడంటూ కొనియాడారు. శాయంపేట మండలం మైలారంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

కార్యక్రమం అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో జ్యోతి రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వం.. సబ్సిడీ ద్వారా అందిస్తున్న మోటర్లను లబ్ధిదారులకు అందజేశారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, పీఏసీఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.