వరంగల్ గ్రామీణ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తరలించడానికి లారీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీల్లో లోడ్ చేయడం, మిల్లర్ల వద్ద అన్లోడ్ చేయడం పూర్తిగా తమ మీదే భారం పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము అరిగోస పడుతున్నామని కర్షకులు వాపోయారు. లారీ అసోసియేషన్లతో మాట్లాడి సరిపడా లారీలు పంపించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
- ఇవీ చూడండి: అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి