నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని వరంగల్ గ్రామీణ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాసరావు ప్రజలను కోరారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెo మండల కేంద్రంతో పాటు గవిచర్లలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం గౌడ కులస్థులకు ఈత, తాటి మొక్కలను పంపిణీ చేశారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని ప్రజలను కోరారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర వాతావరణం అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: 'ఉస్మానియా ఆస్పత్రి దుస్థితికి ప్రతిపక్షాలే కారణం'