వరంగల్ గ్రామీణ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులు దసరా నాటికి పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ హరిత చెప్పారు. వర్ధన్నపేట మండలంలోని, కట్ర్యాల, ఇల్లంద, నల్లబెల్లి, ల్యాబర్తి గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. రైతు వేదికల నిర్మాణలను పరిశీలించి.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.
మంగళవారం వర్ధన్నపేటలోని కొనారెడ్డి చెరువు మరమ్మతు పనుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులు విధుల్లో ఉండి మద్యం సేవించిన ఘటనపై... ఈటీవీ భారత్ వివరణ కోరగా వారిపై ఈఎన్సీకి ఫిర్యాదు చేశామని కలెక్టర్ హరిత తెలిపారు.
ఇదీ చూడండి: పుల్వామా దాడి: పాక్‌లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ