వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల డివిజన్లోని ఆత్మకూర్ మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా పర్యటించారు. పల్లె ప్రగతి పనులు అసంపూర్తిగా ఉన్న గ్రామాల్లో అధికారులను మందలించారు. హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో నర్సరీలను పరిశీలించారు.
డంపింగ్ యార్డు పనులు పూర్తయ్యాయో లేదో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరు మండలంలోని అగ్రమ్ పహాడ్, లింగ మడుగుపల్లి గ్రామాల్లోని నర్సరీలలో మొక్కల్ని పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం నర్సరీలోని మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు.. డీఆర్డీవో సంపత్ రావు, సర్చంచ్‌లు అన్నపూర్ణ, రాజేశ్వరి ,ఎంపీడీఓ, ఈజీఎస్ ఏపిఓ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్